రాష్ట్ర ప్రభుత్వాల కంటే కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అజెండా అత్యద్భుతం అని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు ఇస్తుంటే, కొంత మంది రాష్ట్ర ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకుంటారా? రాజధాని విషయంలో జోక్యం చేసుకుంటారా ?అంటూ వ్యాఖ్యానించడం బాధాకరమని తెలిపారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక నిన్న అన్నవరం సత్యదేవుని దర్శనార్థం విచ్చేసిన సోము వీర్రాజు పైవిధంగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతుందని ఆయన స్పష్టం చేసారు.