అమరావతినే రాజధాని కొనసాగించాలని టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని రైతులకు న్యాయం చేయడానికి తమ ముందున్న మార్గాలను టీడీపీ పరిశీలిస్తోంది. తమను నమ్మి భూములు ఇచ్చిన రైతుల కోసం ఎంతవరకైనా వెళ్లాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉంది.
మీకు దైర్యం ఉంటే మొత్తం అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని బాబు సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలుపు ఓటమిని అమరావతి కి రిఫరెండంగా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. వైసీపీ ఎన్నికలకు రావడానికి భయపడుతుందని ఎద్దేవాచేశారు.
ఇదిలా ఉండగా, బాబు ఇచ్చిన మరో ఆఫర్ ఆసక్తికరంగా మారింది. తాము మొత్తం రాజీనామా చేస్తామని మళ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యమని అమరావతి కి జై కొట్టాలని వైసీపీ కి బంపరాఫర్ ఇచ్చారు. దీనిపై వైసీపీ స్పందన ఏమిటో వేచిచూద్దాం.