మానవజాతి మనుగడలో ఈ శతాబ్దంలో వచ్చిన అతి పెద్ద ఉపద్రవం కోవిడ్ 19. ఈ వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణిస్తున్నారు. మానవజాతి మనుగడకు సవాల్ విసురుతున్న ఈ మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు కోట్లాది రూపాయలతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్ని కుప్పకూలాయి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,977,008. లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 107,142. గా నమోదైంది. నిన్న నమోదైన కేసుల సంఖ్య 60,262 తొలిసారిగా భారత్ లో 90 వేలకు దిగువకు కేసులు చేరుకోవడం కాస్తంత ఉపశమనం అనిపించిన ఈ తరుణంలో వైద్యులు తెలుపుతున్న వివరాలు కాస్త ఆందోళనకరంగా ఉన్నాయి.
మొదటిసారి కరోనా సోకి చికిత్స అనంతరం కోలుకున్న వారికి, రెండోసారి కరోనా సోకితే అత్యంత ప్రమాదకరమనే విషయం తెరపైకి వచ్చింది. కేవలం ఐదు శాతం కేసులలో మాత్రమే ఈ వ్యాధి మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే రెండవసారి సోకితే ఊపిరితిత్తులలో నీరు అధిక స్థాయిలో చేరి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు మరింత పెరిగి జీవితాంతం దాని ప్రభావం ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ లాక్ 5 మార్గదర్శకాల అనుసరించి ప్రజలందరూ తమ దైనందిన కార్యకలాపాలలో యథావిధిగా పాల్గొంటున్నారు. చాలామంది కనీస జాగ్రత్తలైన శానిటైజర్, మాస్క్, తగు దూరం లాంటి నియమాలను పాటించడంలేదు. ఈ తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వ్యాక్సిన్ వచ్చేవరకూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యరంగ నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో అదే జరిగిందని గుర్తు చేస్తున్నారు.