జగన్ ప్రభుత్వం ఏర్పాడ్డాక షాకుల మీద షాకుల తింటున్న టిడిపి నాయకులు, ఇప్పుడు ఆ వరసలో జేసి దివాకర్ రెడ్డి వంతు వచ్చింది. తాజాగా జేసి దివాకర్ రెడ్డి కి మైనింగ్ అధికారులు ఇచ్చిన షాక్ నుండి ఇప్పట్లో కోలుకునేలా కనిపించటం లేదు.
అనంతపురం జిల్లా ముచ్చకోటలో జేసి దివాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరు మీద నడుపుతున్న మైనింగ్ సంస్థల మీద మైనింగ్ అధికారులు కేసులు నమోదు చేసారు. సరైనా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా మైనింగ్ నిర్వహించడం మరియూ మినరల్ మేనేజర్ ఆధ్వర్యంలో జరగాల్సిన మైనింగ్ ఇష్టానుసారం నిర్వహించడం పై మైనింగ్ అధికారులు సీరియస్ అయ్యారు.
జేసి కి చెందిన మైనింగ్ సంస్థల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించామని అందుకే షోకాజు నోటీసులు ఇస్తున్నట్టు మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ రమణారావు తెలిపారు, కాగా ఈ షోకాజు నోటీసులు ఇవ్వడం వెనకా ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని రమాణారావు తెలిపారు.
అయితే గురవారం మైనింగ్ అధికారులు జేసి దివాకర్ రెడ్డి మైనింగ్ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు, ఆ మర్నాడు తనిఖీలు చేపట్టడం పై నిరసనగా జేసి శుక్రవారం నాడు మైనింగ్ శాఖా కార్యాలయం ముందు ధర్నా చేసారు, ఈక్రమంలో ధర్నా వద్దకి వచ్చిన పోలీసులతో కూడా జేసి దురుసుగా ప్రవర్తించినట్టు శుక్రవారం వార్తలు వచ్చాయి. ఇలా జరిగిన మర్నాడే జేసికి చెందిన క్వారీల మీద నోటీసులు రావడం గమనార్హం.
అయితే శుక్రవారం జేసి పోలీసులతో దిగిన వాగ్వాదం లో తనకు తన ఫ్యామిలీ కి మిగిలింది ఈ రెండు క్వారీలే అని, ఇప్పుడు ఇవి కూడా పోతే తన కుటుంబం రోడ్డున పడటం ఖాయమని ఆకలితో చావడమే అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇదంతా వైసిపి గవర్నమెంట్ కక్ష పూరితంగా చేసినపనే అంటూ విరుచుకుపడ్డారు జేసి.
ఇలా ఉండగా అసలు టిడిపి గవర్నమెంట్ లో ఉండగా జేసి దివాకర్ రెడ్డి బ్రదర్ ప్రభాకర్ రెడ్డి టెంట్ వేసి జగన్ ని మీడియా ముందు అసభ్యపదాలు ఉపయోగించి అమ్మనా బూతులు తిట్టిన విషయం అప్పట్లో పెను సంచలనం అయింది. ఈ విషయం అందరికి తెలిసిందే.