కొస్తాకు భారీ తుఫాన్ గండం పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో నేడు రేపు కోస్తా, సీమల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరంలో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఈనెల 12న ఉత్తరాంధ్రలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెల్లొద్దని అధికారులు హెచ్చరించారు.