ఫ్రెంచ్ ఓపెన్ 2020 విజయంతో రాఫెల్ నాదల్ టెన్నిస్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ లు సాధించిన ఫెదరర్ 20 (గ్రాండ్ స్లామ్ లు) సరసన చేరారు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జోకోవిచ్‌పై 6-0, 6-2, 7-5 తేడాతో విజయం సాధించి 13 సారి ఫ్రెంచ్ టైటిల్ సాధించి, ఫ్రెంచ్ గ్రాండ్‌స్లామ్ లో ఎవరికి అందని రికార్డు సెట్ చేసాడు.
మొదటి సెట్ లో అయితే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నాదెల్, రెండో సెట్లోనూ అదే దూకుడు చూపించాడు ప్రత్యర్థి జకోవిచ్‌కు ఎక్కడా అస్సలు ఛాన్స్ అనేది ఇవ్వలేదు. అయితే మూడో సెట్లో జోకోవిచ్ మాత్రం గట్టి పోటీ ఇచ్చాడనే చెప్పాలి, హోరాహోరీగా సాగిన మూడో సెట్ లో సత్తా చాటి చివరికి టైటిట్ గెలిచాడు నాదల్. మొత్తంగా ఈ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో నాదల్ చేతిలో జకోవిచ్ మూడుసార్లు ఓడిపోయాడు.
అయితే ఇంకొక్క గ్రాండ్ స్లామ్ సాధించి, అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించినవాడిగా ప్రపంచ రికార్డు సాధించడం ఎంతవరకూ అవుతుందో చూడాలి. టైటిల్ గెలిచిన నాదల్కు జోకోవిచ్ అభినందనలు తెలిపాడు.
టోర్నీలో నా ప్రదర్శన బాగున్నా నాదల్ ప్రత్యర్థి అయ్యే సరికి నా ప్రదర్శనలో తేడా అయితే కనిపించింది, ఖచ్చితంగా నాదల్ గొప్ప ప్రత్యర్థి అంటూ ప్రశంసలు వర్షం కురిపించాడు. అలాగే అటు నాదల్ కూడా జోకోవిచ్ బలమైన ప్రత్యర్థిని అంటూ చెప్పుకొచ్చాడు.