వరంగల్ జిల్లాలో ఏబీవీపీ విద్యార్థుల పై రాష్ట్ర ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల తెలంగాణలోని ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత విద్యార్థులపై, విద్యార్థి సంఘాల పై ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా లాఠీఛార్జ్ చేసి కేసులు నమోదు చేసి ఉద్యమాలను ఆపగలమనుకోవడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇకనైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.