వరుస భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం వరదల్లో చిక్కుకుంది. నగరం ఎటు చూసినా నదులను తలపిస్తుంది. చాలా మంది వరదల్లో ఆచూకీ లేక పోయారు. ప్రజలు ఇళ్ళల్లో లేని పరిస్థితి. కొన్ని ఏరియాల్లో ఇళ్ళు వరద ప్రభావానికి పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి.
హైవే రోడ్లు కూడా స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయి. ముందుగానే నీట మునిగిన ప్రాంతాలన్నీ మళ్లీ భారీ వర్షాలు పడితే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ప్రభుత్వ పనితీరు, నగర దుస్థితి ఎలా ఉంది అనేది చెప్పడానికి అద్దం పడుతుంది. ఇంతలోనే మరో భారీ వర్ష సూచన వినాల్సి వచ్చింది. ఈ రోజు నుండి మళ్లీ భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని జిహెచ్ఎంసి ఆదేశించింది.
దక్షిణ ఏపీ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 2.1 కిలో మీటర్ల మధ్య మరో అల్పపీడన ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఇది మరో అల్పపీడనంగా మారి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు.. ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.