విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి ఎన్నారై భక్తుడు 40 లక్షల విలువైన హారాన్ని బహూకరించారు. దుర్గ గుడి ఈవో సురేష్ బాబు కి ఈ హారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ గత 6 నెలల నుంచి అమ్మవారికి 7 వారాల నగలు అలంకరిస్తున్నాము.
సోమవారం- ముత్యాలు
మంగళవారం- పగడాలు
బుధవారం- పచ్చల
గురువారం- కనకపుష్యరాగాలు
శుక్రవారం-డైమండ్
శనివారం- నీలాలు
ఆదివారం-కెంపులు
ఇలా అలంకరణ విధానం సాగుతుంది. భక్తులు తాతినేని శ్రీనివాస్ మమ్మల్ని సంప్రదించినప్పుడు కనపుష్యరాగం హారం కోసం ఆడిగాము. 40 లక్షల రూపాయలతో అమ్మవారికి కనకపుష్యరాగాలు హారం చేయించి శ్రీనివాస్ అమ్మవారికి కానుకగా అందించారు. ప్రతి గురువారం అమ్మవారికి ఆ హారాన్ని అలంకరిస్తామని తెలిపారు. కనకపుష్యరాగాలు అన్ని ఒకే సైజు కోసం సింగపూర్ నుంచి తెప్పించామని వివరించారు. భక్తులు ఎవరైనా అమ్మవారికి 7 వారాల నగలు సమర్పించాలి అనుకుంటే దేవస్థానం లో సంప్రదించాలని కోరారు. ఎన్నారై భక్తుడు తాతినేని శ్రీనివాస్ మాట్లాడుతూ మేము అట్లాంటాలో ఉంటాము. మా అబ్బాయి మొదటి జీతంతో అమ్మవారికి హారం చేయించాలనే సంకల్పం తో చేయించి ఇవ్వడం మా పూర్వ జన్మ సుకృతం అని తెలిపారు.