రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల పరిస్థితి చక్కదిద్దాలని గత వారంలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చి 2వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వారం తిరక్కుండానే, వాహనదారుల నడ్డి విరిగే రేంజ్ లో మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం వాహనదారులను ఒక విధమైన షాక్ కి గురి చేసింది.
వాహన జరిమానాలు భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానాలు విధించనున్నారు.
జరిమానాలు ఈ క్రింది విధంగా నిర్ణయించారు.
వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750
సమాచారం ఇవ్వడానికి నిరాకరించిస్తే – రూ. 750
అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000
అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000
డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000
రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000
వేగంగా బండి నడిపితే – రూ. 1000
సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000
రేసింగ్ మొదటిసారి రూ. 5000
రెండో సారి రూ. 10000
రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000
రెండో సారి రూ. 5000
పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000
ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం
వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000
ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 10000
అనవసరంగా హారన్ మోగిస్తే – మొదటిసారి రూ. 1000
రెండోసారి రూ. 2000 జరిమానా
రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు అమ్మినినవారికి – రూ. 100000
ఈ విధంగా జరిమానాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమౌతుంది. అత్యంత దారుణంగా ఉన్న రోడ్ల వలన వెన్ను, మెడ తదితర ఆరోగ్య సమస్యల కోసం వేలకువేలు హాస్పిటల్స్ కు ఖర్చు చేయాల్సి వస్తుందని వాటి సంగతి చూడకుండా మాపై ఈ రకమైన బాదుడు ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
