• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

నేటి నుండి ఎంసెట్ కౌన్సిలింగ్..

TrendAndhra by TrendAndhra
October 23, 2020
in Latest News
0 0
0
Spread the love

కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌

ఏపీలో నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఆద్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు గాను రాష్డ్ర వ్యాప్తంగా 25 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్ధం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఇళ్ల నుంచే ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అత్యవసరమైతేనే హెల్ప్‌లైన్ సెంటర్లకి విద్యార్థుల రావాల్సి ఉంటుందని తెలిపారు.

విద్యార్థుల సౌకర్యార్ధం నాలుగు హెల్ప్‌లైన్ నంబర్లు – 8106876345, 8106575234, 7995865456, 7995681678 అందుబాటులో ఉంచారు.

జనరల్, బీసీ విద్యార్థులకు 1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయిలు ప్రాసెసింగ్ ఫీజుగా నిర్ణయించారు. నేడు ఒకటో ర్యాంకు నుంచి 20,000 ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగననుండగా రేపు(24) న 20,001 ర్యాంకు నుంచి 50,000 వరకు, 25న 50,001 ర్యాంకు నుంచి 80,000 వరకు, 26న 80,001 నుంచి 1,10,000 ర్యాంకు వరకు, 27న 1,10,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. పీహెచ్‌, స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్, ఎన్‌సీసీ కోటా విద్యార్ధులకి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ జరగనుంది.


Spread the love
Tags: AP Newseamcet counselling
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.