ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులు చెరిపేస్తూ సరికొత్త రికార్డులవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాలు.
కరోనా మొదలైనప్పుడు ఏదైతే స్పీడ్ తో ఉందో మూడో విడత వేవ్ లో అంతకుమించిన స్పీడ్ తో ఉంది. తగ్గుతుంది అనే సంతోషాన్ని మూడునాళ్ల ముచ్చట చేస్తూ రెండో వేవ్, అలాగే రెండో వేవ్ తగ్గుతుంది అని కొంచెం ఆనందపడేలోపు మూడో వేవ్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అమెరికాని కుదిపేస్తున్నాయి.
ఒక పక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇంకో పక్క శీతాకాలంలో మూడో వేవ్ విజృంభణ అమెరికన్లకి కంటిమీద కునుకు లేకుండా పోయింది.
గతవారం రోజులుగా అమెరికాలో నమోదు అయినకరోనా కేసులు అక్షరాలా 481,372, దాదాపు 5 లక్షల కేసులు. అగ్నికి ఆయువు తోడైనట్టు గా ఎలక్షన్ ప్రచారానికి శీతాకాలం తోడవడంతో కరోనా అమెరికాని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
జాన్ హప్కిన్స్ యూనివర్శిటీ డేటా ప్రకారం ప్రతీ 1.26 సెకండ్ కి ఒక్కో కేసు చొప్పున కేసులు నమోదు అవుతున్నాయి అమెరికాలో. ఈ వ్వవహారం చూస్తుంటే ఇప్పట్లో కొలుకునే పరిస్తితులు అయితే కనిపచడంలేదు.
అగ్రరాజ్యం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ప్రపంచరారాజు అయింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా అగ్రతాంబూలం అందుకుంది. అయితే అవన్నీ ఒక ఎత్తు వైరస్ ఇంకో ఎత్తు.
ఒకవేళ నిజంగా ట్రంప్ చెప్పినట్టు చైనా కుట్రే కనుక అయితే అమెరికా చైనా మధ్య సంబంధాలు ముగిసినట్టే.