వైసీపీ చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ను సమర్థించారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. తాజాగా ఒక టీవీ ఛానల్ డిబెట్ లో ఆయన మాట్లాడుతూ గీతం కళాశాల వ్యవహారం లో యాజమాన్యం నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూట్ గా నడపబడుతుంది, అలాంటి వాళ్ళు కబ్జాలు చేయడం కచ్చితంగా జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు. ఇలా కబ్జాలు కాబడిన ప్రభుత్వ స్థలాలు ఏ పార్టీ ఆధీనంలో ఉన్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ విషయంలో అది వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి, ఇలా ఏ పార్టీకి చెందిన నాయకులది అయినా కూల్చివేయాలని, ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని బొలిశెట్టి కోరారు.
ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది మంచి పని అలాంటి పనులను జనసేన పార్టీ సమర్థిస్తుందని, అలాగే ప్రభుత్వం చేసే ఏ చెడ్డ పనినైనా జనసేన పార్టీ కచ్చితంగా ప్రజల ముందుకు తీసుకువెళుతుందని అన్నారు.
అలాగే ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్థిక మూలాలను మాత్రమే దెబ్బతీయలనుకోవడం తప్పు అని, తప్పు చేసింది ఎవరైనా కచ్చితంగా వ్యవహరించాలని, ప్రభుత్వ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నా నోటీసులు ఇచ్చి కూల్చివేయాలని ఆయన అన్నారు. అలాగే విజయవాడ కరకట్ట పై వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజా వేదిక విషయం లో ముందుగానే ప్రభుత్వాన్ని తాను హెచ్చరించానని, నదీ పరిరక్షణ కోసం డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆ విషయంలో గత ప్రభుత్వాన్ని హెచ్చరించారు అని, కానీ ఆ రోజున “మీరెవరు నాకు చెప్పడానికి అంటూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆ విషయాన్ని తోసిపుచ్చింది” అని ఆయన అన్నారు.
