స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న అపర మేధావి నారా లోకేష్ పోలవరంపై మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయనకు వున్న జ్ఞానం బయట పడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ వ్యయం సుమారు యాబై వేల కోట్లు అయితే, దానిలో దాదాపు పద్దెనిమిది వేల కోట్లు వ్యయం చేశామని, అంటే డెబ్బైశాతం పనులు టిడిపి ప్రభుత్వమే పూర్తి చేసిందని ఈ స్టాన్‌ఫర్డ్ వీరుడు చెబుతున్న లెక్కలు ఆయన అవగాహనను చాటుతున్నానయని అన్నారు. స్టాన్‌ఫర్డ్ లో చదువుకున్న విజ్ఞానంతో ఈ పప్పుస్వామి మరోసారి తన మాటలతో తనకున్న అవగాహనా రాహిత్యంను చాటుకున్నారన్నారు.
ఫారెన్ లో లోకేష్ ఏం చదువుకున్నాడంటే.. ఈ పదేళ్ళ కాలంలో ఒక ఎకానమిస్టు పేరుగానీ, ఒక ఎకనమిక్ థియరీగానీ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వాడు మాట్లాడిన ఒక మాటగానీ ఎప్పుడూ మాట్లాడలేదు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి లోకేష్ పుస్తకాల బ్యాగ్ పట్టుకుని లేదా పుస్తకాలు పట్టుకుని లేదా ఒక ల్యాప్ టాప్ పట్టుకుని కనీసం ఒక పెన్ను పట్టుకుని వెళుతున్న ఫోటోలు లేవుగానీ, గోచీ ఫోటోలు మాత్రం సోషల్ మీడియా నిండా కావాల్సినన్ని దొరుకుతున్నాయి. కాబట్టి ఈ “గోచీ బాబు”కి రాష్ట్ర ప్రజలందరి మీద ఉన్న దోపిడీ ప్రేమని కనిపెట్టిన రాష్ట్ర ప్రజలు, వాళ్ళ నాన్నకి 102 సీట్ల నుంచి 23 సీట్లకు తగ్గించడం ద్వారా అసెంబ్లీలో గోచీని మిగిల్చారు. మరి మంగళగిరిలో లోకేష్ కు అది కూడా లాగేశారు. కాబట్టి, నోరు అదుపులో పెట్టుకుని లోకేష్ మాట్లాడితే మేం కూడా మర్యాదగానే సమాధానం ఇస్తాం. లేదంటే, గురివింద గింజ వ్యవహారం అవుతుంది అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.
