కోవిడ్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ లు అన్ లాక్ తర్వాత ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు ఒకొక్కరుగా సెట్ లో అడుగు పెడుతున్నారు. మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ తాను నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ గత ఆదివారం నుండి సెట్ లో అడుగు పెట్టి సంక్రాంతి రిలీజ్ కి సినిమాను సిద్ధం చేస్తున్నారు.
ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రం ఆచార్య షూటింగ్ ఈ నెల 9వ తేదీ నుండి మొదలు కాబోతున్నట్లు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ తెలిపింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ నెల రోజుల పాటు సాగే భారీ షెడ్యూల్ కి రంగం సిద్దం చేసినట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తామని అభిమానులకు తీపి కబురు చెప్పింది.
