కావలిలో వైసీపీ నేతల అరాచకాలకు బలైన కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించారు నారా లోకేష్.
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బినామీలైన జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిలు కరుణాకర్ ఆస్తులు లాక్కుని, అప్పులు చేసి చెరువుల్లో పెంచిన చేపలు పట్టుకోనీయకుండా నానా హింసలు పెట్టడంతోనే కరుణాకర్ చనిపోయాడని కుటుంబసభ్యులు రోదించడం నాకూ కన్నీళ్లు ఆగలేదని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి కట్టాలనుకున్న కాంప్లెక్స్‌కి కరుణాకర్ ఇల్లు అడ్డురావడంతో వేధించి చంపేసి ఆ ఇల్లు కాజేయాలని చూశారనీ.. టిడిపి నేతలు విడిపించి తెచ్చిన కరుణాకర్ ఇంటి పత్రాలను కుటుంబసభ్యులకి అందజేసిన ఆయన పిల్లలు చదువు బాధ్యతలు తీసుకుంటానని తెలిపారు.
టిడిపి పోరాటంతో కేంద్రం స్పందించడంతో చంపేసి అంత్యక్రియలు చేసిన వైసీపీ వాళ్లే పరామర్శకి వస్తున్నారని ఆయన ఆరోపించారు.
