2019 ఎన్నికల్లో పెడన నియోజకవర్గం లో వైసీపీ (జోగి రమేష్) విజయాన్ని అందుకోగా.. టీడీపీ (కాగిత కృష్ణ ప్రసాద్) రెండో స్థానం లో మరియు జనసేన (అంకెం లక్ష్మీ శ్రీనివాస్) మూడవస్థానంతో సరిపెట్టుకున్నారు.. కానీ బూత్ వైజ్ రిజల్ట్ పరిశీలించగా కొంత ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది.. ముందుగా అసలు మొత్తం ఎన్ని ఓట్లు..? అందులో ఏ పార్టీ కి ఎన్ని..? అనేది తెలుసుకుందాం..!!
ఇక్కడ మొత్తం 1,45,952 ఓట్స్ పోలవ్వగా అందులో 104 ఓట్స్ రిజెక్ట్ అయ్యి.. 1407 ఓట్స్ నోటా కి పడ్డాయి.. ఇక మిగిలిన ఓట్లలో వైసీపీ – 61920, టీడీపీ – 54081, జనసేన – 25733 Others – 2707 ఓట్లు సాధించారు..
ఇప్పుడు ఇదే రిజల్ట్ ని బూత్ వైజ్ పరిశీలించగా మొత్తం ఉన్న 216 బూత్ లలో 108 బూత్ ల నుండి జనసేన సాధించిన ఓట్లు 22548 అంటే మొత్తం జనసేన సాధించిన 25733 ఓట్లలో దాదాపు 90% ఓట్స్ ఈ 108 బూత్ ల నుండే కావడం గమనార్హం. జనసేనకు బలమైన కాపు సామాజక వర్గ ఓట్లలో ఎక్కువ శాతం ఈ బూత్స్ లో ఉండడమే దీనికి ప్రధాన కారణం గా చెప్పవచ్చు.
నియోజకవర్గం లో ఈ సగభాగం జనసేన వెరీ స్ట్రాంగ్ అని ఇక్కడ అర్ధం అవుతుంది. ఈ 108 బూత్స్ లో జనసేన ఎంత స్ట్రాంగ్ అంటే కొన్ని బూత్స్ లో టీడీపీ వైసీపీ ఓట్లను కలిపినా ఆ నెంబర్ జనసేన కు వచ్చిన ఓట్స్ కంటే తక్కువ. వచ్చే ఎన్నికల్లో ఈ 108 బూత్స్ నుండి ప్రస్తుతం ఉన్న బలం దృష్ట్యా జనసేన కు మరో పదివేల ఓట్ల పైన వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు 32000-35000 ఓట్లు కాండిడేట్ తో సంబంధం లేకుండా జనసేన ఈ బూత్స్ నుండి కొల్లగొట్టడం ఖాయం. మొన్నటి పంచాయితీ ఎలక్షన్లే దీనికి రుజువు.
కానీ వచ్చిన చిక్కల్లా మిగిలిన 108 బూత్స్ నుండే.. అక్కడ లాస్ట్ ఎలక్షన్స్ లో జనసేన సాధించిన ఓట్లు కేవలం 3088. అంటే కేవలం 3.15%. జనసేనకు బలమైన కాపు సామాజిక వర్గ ఓట్లు ఈ బూత్స్ లో లేకపోవడమే ఇక్కడ ఇంత తక్కువ ఓట్లు జనసేనకు పోల్ అవ్వడానికి ప్రధాన కారణం గా చెప్పవచ్చు. ఈ బూత్ ల మీద జనసేన గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకూ అభిమానులు, కార్యకర్తల సందడి తప్ప ఈ బూత్ లపై జనసేన నాయకులు ఎంత వరకూ దృష్టి పెట్టారు అనేదే ప్రశ్న.
అయితే అధికారం లోకి వచ్చి మూడేళ్లు దాటినా అధికార పార్టీ నియోజకవర్గాన్ని గాలికి వదిలేయడం వల్ల వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. గ్రామాల్లో సరైన తాగునీరు లేదు. రోడ్ల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రైతుల్లో, ఉద్యోగస్థుల్లోనూ వైసీపీ పై తీవ్ర వ్యతిరేకత. జెండా పట్టుకు తిరిగిన కార్యకర్తల్లోనే వైసీపీ పై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.
ఇక ప్రతిపక్ష టీడీపీ సంగతి ఎలక్షన్స్ అయ్యాక ఆ పార్టీ గానీ.. పార్టీ నాయకులు గానీ జనం లో కనిపించింది లేదు. MLA జోగి రమేష్ కి భయపడి టీడీపీ నాయకులే బయటకు రాకుంటే కార్యకర్తలకు ధైర్యం ఎక్కడ నుండి వస్తుంది అని టీడీపీ మీటింగ్స్ లొనే బహిరంగంగా చెబుతున్న పరిస్థితి.
అయితే నియోజకవర్గంలో సమస్యల పై స్పందించడం లో కానీ అధికార పార్టీ ఆగడాలపై ప్రశ్నించే విషయం లో గానీ ఇక్కడ జనసేన కార్యకర్తలు ముందుండటం జనసేన కు అనుకూలమైన అంశం. ఇదివరకటితో పోలిస్తే BC, SC, ST సామాజిక వర్గాల్లో జనసేన పార్టీ పై సానుకూలం గా ఉండడం జనసేనకు కలసి వచ్చే పరిస్థితి.
ఒకవేళ జనసేన ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని ఈ 108 బూత్ లలో 20% ఓట్స్ సాధించ గలిగితే పెడన నియోజకవర్గం లో జనసేన విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరు అనేది సత్యం… మరి ఈ బూత్స్ మీద జనసేన పార్టీ ఎంత వరకూ దృష్టి పెడుతుంది ఎలక్షన్ వరకూ ఈ సానుకూల పరిస్థితిని ఎలా నిలుపుకుంటుందో చూడాలి.
