కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రకి భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో బీజేపీ లీడర్లు కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొన్నటివరకు పప్పు అంటూ చిత్రీకరించిన బీజేపీ ఇపుడు మాత్రం అతిగా స్పందిస్తుంది.
ఈ క్రమంలో కొంతమంది మంత్రులు మాత్రం అత్యుత్సహం తో పప్పులో కాలేసి తాము అభాసుపాలు అవడంతో పాటు బీజేపీ పార్టీ ని కూడా అభాసుపాలు చేస్తున్నారు.
అసలు విషయం కి వస్తే గతవారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో భాగంగా కన్యాకుమారి సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే కన్యాకుమారి లోని స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించకుండా కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ స్వామి వివేకానందని అవమానించారు అంటూ స్మృతీ ఇరానీ ఒక వీడియోలో రాహుల్ గాంధీ మీద విమర్శలు గుప్పించారు.
అయితే స్మృతీ వీడియో బయటకి వచ్చిన నిమిషాల వ్యవధిలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ అసలు వీడియో బయటకి తీసుకొచ్చి కౌంటర్ పోస్ట్లు పెడుతున్నారు. అయితే అసలు వీడియోలో రాహుల్ చాలా క్లియర్ గా స్వామీ వివేకానంద కి నమస్కరిస్తూ కాళ్ళకి మొక్కినట్టు కనిపిస్తుంది.
ఇపుడు ఇదే వీడియో ని స్మృతీ ఇరానీ విమర్శలు వీడియో కి జోడించి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.
ఈ వీడియో వైరల్ అవడం తో అటు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పరువుతో పాటు బీజేపీ పరువు కూడా పోతుంది.