అధికారాన్ని చూసుకుని రెచ్చిపోతున్నారు వైసీపీ శ్రేణులు. తిరుపతిలోని వెంకటరెడ్డి కాలనీలో డివిజన్లో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ అడిగినందుకు జనసేన నేత ఇంటిపై దాడికి తెగబడ్డారు వైసిపి నేతలు.
ఒక్కసారిగా ఇంటిలోకి దూరి ఇంట్లోని ఫర్నిచర్, సామాన్లు ధ్వంసం చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పలువురు జనసేన మహిళలకు గాయాలయ్యాయి, విషయం తెలిసి జనసేన నేతలు కిరణ్ రాయల్, సుభాషిని ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
తిరుపతిలోని ఎస్కే బాబు వర్గానికి చెందిన వారు దాడికి దిగినట్టు సమాచారం. జనసేన అనే మాట ఇక్కడెక్కడ వినిపించకూడదు, ఇక్కడ అంతా వైసిపి పార్టీలోనే ఉండాలంటు హకుం జారీ చేశారు. ఘటన పై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
