కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ల్యాండ్ ని సమీకరించలేదు అంటున్నారు కేంద్ర మంత్రి భారతి పవార్.
కేంద్ర ఆరోగ్య మరియు ప్రజా సంక్షేమ శాఖ మంత్రి భారతి పవార్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మీడియా తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీ కి సంబంధించి జాతీయ ప్రముఖ్యత సంస్థలకు నిధులు కేటాయించిందని, కానీ ఆ సంస్థల కి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కనీసం ల్యాండ్ కూడా సమీకరించలేదని అందుకే కేంద్రం ఏమిచెయ్యలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలిపారు.
అలాగే ఆమె సోమవారం మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజా పంపిణి వ్యవస్థ పారదర్శకంగా పనిచేయడంలేదని విమర్శించారు.
రాష్ట్రంలో చాలా వెల్ఫేర్ స్కీం లకి కేంద్రం నిధులు అందిస్తుంటే, రాష్ట్రం కనీసం ప్రకటనలలో ఎక్కడా కనీసం ప్రధాని ఫోటో కూడా వేయకుండా సొంత ప్రచారం చేసుకొంటోంది అని ఆమె తెలిపారు.
అలాగే TIDCO ఇళ్ళకి సంబంధించి కేంద్రం మచిలీపట్టణం లోని 8,912 ఇళ్ళకి కాను కేంద్ర వాటా పూర్తిగా చెల్లించినప్పటికీ రాష్ట్రం మాత్రం ఇళ్లనిర్మాణం లో చాలా ఆలస్యం గా నిర్మాణం చేబడుతున్నట్టు గమనించాం అని ఆమె తెలిపారు.
కేంద్ర మంత్రి పర్యటనలో రాష్ట్రం నుండి బీజేపీ లీడర్లు కామినేని శ్రీనివాస్ , పాక వెంకటసత్యనారాయణ, ఎం. ప్రసాద్, శ్రీనివాసరాజు తదితరులు ఆమె వెంట ఉన్నారు.
