ఎప్పుడూ ఏదో ఒకటి కెలుక్కోవడం ఆనక నవ్వుల పాలవడం వైసీపీకి అలవాటుగా మారింది. తాజాగా ఈసీ చేతిలో చివాట్లు తిన్న ఈ విషయం మాత్రం చాలా కామెడీ గా ఉంది. విషయం ఏంటంటే..
వైస్సార్ జయంతి సందర్భంగా జరిగిన ప్లీనరీ సమావేశాల్లో పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైయస్ జగన్ ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చెల్లదని ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పింది. ప్రజాస్వామ్యంలో ఇలా ఒక పార్టీకి శాశ్వత అధ్యక్షుడు ఉండడం జరగదని, ఎప్పటికప్పుడు ఎన్నికలు జరగాలని తెలిపింది.
ఈ నియమాలను అంగీకరించిన తర్వాతే పార్టీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు వైసిపి ఈ నిబంధనకు అతిక్రమించి శాశ్వత అధ్యక్షుడు అని ఎన్నుకోవడంపై ఇప్పటికే చాలాసార్లు ఆ పార్టీని వివరణ కోరినా ఎలాంటి స్పందన లేకపోవడంతో శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రకటిస్తూ ఇది చెల్లుబాటు కాదని ఈసీ తేల్చి చెప్పింది.
