కడప పాత ఆర్టీసీ బస్టాండ్‌కు కార్పొరేషన్ అధికారులు తాళం వేసేశారు, దీంతో బస్సులన్నీ బయటే ఉండిపోయాయి.
రోడ్డు మీద నుంచే ప్రయాణికుల్ని ఎక్కించుకుని బయలుదేరుతున్నాయి. అయితే అసలు ఈ కార్పొరేషన్ అధికారులు ఎందుకు తాళాలు వేశారా అని ఆరా తీసిన జనానికి దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్ తెలిసింది.
అదేమింటే ఆ ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీది కాదు. కార్పొరేషన్‌ది. నెలా నెలా అద్దె కడతామని బస్టాండ్ కోసం అద్దెకి తీసుకున్నారు. కానీ కట్టడం లేదు అంట.. చూసీ చూసీ విసుగుచెందిన కార్పొరేషన్ అధికారులు అడిగి అడిగి ఇక అడగలేక నేరుగా ఆర్టీసీ బస్టాండ్‌కు తాళాలేసేశారు.
