తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతింది..!!
తెలుగుజాతి కి అవమానం జరిగింది..!!
మొత్తం తెలుగు జాతికే నష్టం కలిగింది..!!
ఎప్పుడూ..?
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు..
ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వనప్పుడు..
వెంకయ్య నాయుడు కి రాష్ట్రపతి పదవి రానప్పుడు..
లోకేష్ ని మంగళగిరిలో ఓడించినప్పుడు..
ఇదిగో ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ పేరు తీసి వైయస్సార్ పేరు పెట్టినప్పుడు..
అసలు జగన్ చేసింది ముమ్మాటికి తప్పే.. అది కచ్చితంగా ఎన్టీఆర్ కి అవమానమే.. దాన్ని ఎన్టీఆర్ కి జరిగిన అవమానం కింద చూడాలి గాని.. మొత్తం తెలుగు జాతికి జరిగిన అవమానం ఎట్లా అవుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారనా..? ఆ లెక్కన వైఎస్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నే చేశారు కదా.. ఇద్దరూ తెలుగు వాళ్లే.. పోనీ తెలుగు వాళ్ళ పేర్లు తీసి ఇతర భాషల వాళ్ళ పేరు ఏదైనా పెడితే అది తెలుగు వాళ్లకి జరిగిన అవమానం అని అనుకోవచ్చు.. ఒక మాజీ ముఖ్యమంత్రి పేరు తీసి ఇంకో మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టారు.. ఇందులో తెలుగు జాతికి అవమానం ఏముంది? అంటే తెలుగుజాతి అంటే తెలుగుదేశం పార్టీ ఒకటే అనుకుంటున్నారా లేక ఒక సామాజిక వర్గం మాత్రమే అనా..?
చంద్రబాబు మీద కేసు నమోదు అయినప్పుడు కూడా అంతే.. తెలుగు జాతి మొత్తాన్ని తక్కువ చేసినట్టు కుల మీడియా లో ఒకటే రోదనలు.!!
హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పెట్టి ఉండొచ్చు. అంతమాత్రాన అది ఎన్టీఆర్ యూనివర్సిటీ అయిపోయినట్టేనా?
చాలా మంది ముఖ్యమంత్రులు చాలా మంచి పనులు చేసారు, వాళ్ళకి అధికారముంది కాబట్టి చేసారు. చేయగలిగారు. ఎన్టీఆర్ కూడా అంతే.. అందులో కొత్తఏముంది ? నందమూరి, నారా ఫ్యామిలీలు మాత్రమే తెలుగు జాతి అన్నట్టు వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే తెలుగుజాతి మొత్తానికి ఆపద వచ్చినట్టు చెప్పడం మాత్రం చంద్రబాబు అండ్ కుల మీడియా కి మాత్రమే చెల్లింది.
ఇప్పుడు వీళ్ళ లాజిక్ ప్రకారం ఎన్టీఆర్ సీఎం అయ్యారు కాబట్టి హెల్త్ యూనివర్సిటీ కి అయన పేరుపెట్టడం తెలుగు జాతికి గర్వకారణం, గౌరవం అయితే..
రాజశేఖర్ రెడ్డి వరసగా రెండు సార్లు సీఎం అయ్యారు కదా, ఎన్టీఆర్ పేరు తీసేసి వైస్సార్ పేరు పెట్టడం కూడా గర్వకారణమే అవ్వాలి కదా? కానీ కుల మీడియా దృష్టిలో తెలుగు జాతికి అవమానం అయింది.
చంద్రబాబు, కుల మీడియా అంతా కలిసి తెలుగుజాతికి అవమానం అనే మాట వదిలేసి ఎన్టీఆర్ కి అవమానం అంటూ నిరసనలు చేస్తే చాలా బాగుంటుంది, అలాచేస్తే ఒకవేళ తటస్థులు కూడా ఆలోచించే అవకాశం ఉంది.
అలా కాకుండా తెలుగుజాతికి అవమానం అంటే మాత్రం ఈసొషల్ మీడియా యుగంలో పని అయ్యేలా కనబడటం లేదు
కాబట్టి కుల మీడియా ఒకసారి పునరాలోచించి నిరసనలు చేస్తే బాగుంటది అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు.
అదీగాక “వాడి పని అయిపోయింది.. మెల్లగా వాడి పేరు తొలగించాలి.. ఒక్కొక్క పథకానికి ఆడి పేరు తీసేయండి..” అని రాధాకృష్ణ అంటుంటే.. చంద్రబాబు “కరెక్టే .. అయిపోయింది.. వాడిని జనం ఎప్పుడో మరచి పోయారు..” అని ఎన్టీఆర్ ని నీచంగా మాట్లాడిన వీళ్లే ఈరోజు జగన్ ఎన్టీఆర్ పేరు మార్చగానే గగ్గోలు పెట్టడం కామెడీగా ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
