రాబోయే ఎన్నికల్లో విజయవాడ నుంచి వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హీరో నాగార్జున ఖండించారు. ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ఏదో ఓ పార్టీ తరపున అభ్యర్థిగా తన పేరును ప్రచారంలోకి తీసుకువస్తున్నారని కానీ తనకు అలాంటి ఆలోచన లేదని నాగార్డున స్పష్టం చేశారు.
గత పదిహేనేళ్లుగా జరుగుతున్న ప్రచారం మళ్లీ జరుగుతోందన్నారు. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాననడం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో నాగార్జున ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని జరుగుతున్న ప్రచారంకి పుల్ స్టాప్ పడినట్టే..
