తెలుగుదేశం పార్టీ ఆఫీసియల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ట్విట్టర్ లో టీడీపీ అకౌంట్ కోసం టైప్ చేస్తే టైలర్ హాబ్స్ Tyler Hobbs అనే అకౌంట్ జైటీడీపీ హ్యాండిల్ తో కనబడుతోంది. పైగా ఆ అకౌంట్ లో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్టులు కనబడుతున్నాయి.
దీనిపై ఐటీడీపీ స్పందించింది. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను అధికార వైసీపీ మద్దతు ఉన్న కొన్ని దృష్ట శక్తులు హ్యాకింగ్ చేశాయని ఆరోపించింది. త్వరలోనే టీడీపీ అకౌంట్ ను పునరుద్ధరిస్తామని వెల్లడించింది.
