తమ పాత మిత్రుడు, వివిధ పార్టీ లకి ఎన్నికల వ్యూహకర్త గా పేరొందిన ప్రశాంత్ కిషోర్ పై బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పని చేస్తున్నారని నితీశ్ కుమార్ ఆరోపించారు. సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలమైన సితాబ్ దయారాలో శనివారం ఆయన మీడియాతో కాసేపు ముచ్చటిచారు.
ఒకానొక టైములో జేడీయూ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రశాంత్ కిషోర్ తనకు సూచించాడని నితీశ్ కుమార్ వెల్లడించారు. ‘ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ నన్ను కలిశాడు. నేనేమి తనను కలవమని అడగలేదు, తనే వచ్చాడు. ఇప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. కానీ , అసలునిజాలు దాచేస్తున్నాడు. నిజానికి, ఆయన నాలుగేళ్ల క్రితం నా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోరాడు’ అంటూ ప్రశాంత్ కిషోర్ మీద ఆరోపణలు చేసారు.
“జేడీయూ కి నాయకత్వం వహించాలని నితీశ్ నన్ను కోరాడు” అని ఇటీవల ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల మీద స్పందించమని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా , నితీశ్ పై విధంగా స్పందించారు.