లోకనాయకుడు కమల్‌హాసన్ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్, అందచందాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ శ్రుతి హాసన్. కెరీర్‌లో ఆ మధ్య గ్యాప్ తీసుకున్నా గతేడాది జనవరిలో మాస్ మాహారాజా రవితేజ క్రాక్ మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా శృతి హాసన్ తన బాడీ గురించి ఒక షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసింది. కొన్నేళ్లుగా శృతి హాసన్ ముక్కు విభిన్నంగా సన్నగా కనిపిస్తోంది. ఆమె ప్రారంభ చిత్రాల్లో ఉన్నట్లు ఇప్పుడు ముక్కు లేదు. దీంతో శృతి హాసన్ అందం కోసం ముక్కుకి సర్జరీ చేయించుకుంది అంటూ ప్రచారం జరిగింది. దీని గురించి శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చింది.
నిజమే.. నా ముక్కుకి సర్జరీ జరిగింది. అయితే దీని గురించి నేను సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంతా అనుకున్నట్లు నేను అందం కోసం సర్జరీ చేయించుకోలేదు. నా ముక్కుకి గాయం అయింది. తప్పని పరిస్థితుల్లో సర్జరీ జరిగింది. అందువల్లే నా ముక్కు మునుపటిలా లేదు అని శృతి హాసన్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో క్రేజీ చిత్రాలున్నాయి. బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది.
