తెలుగులో పలు షోలు, ఈవెంట్లలో తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ విష్ణుప్రియ. అయితే కొద్ది రోజులుగా యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందుకు కారణంగా ఈ అమ్ముడు ఇటీవల నటించిన జరీ జరీ పంచ కట్టి అనే సాంగ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నది అంతా డిజిటల్ యుగం అయిపోయింది.
ఈ సోషల్ మీడియా యుగంలో ఏ సమాచారం చేరవేయాలన్నా క్షణాల్లో అప్డేట్ చేసేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో.. అంతే చెడు జరుగుతోంది. కొన్నిసార్లు సెలబ్రిటీల అక్కౌంట్లను కొందరు హ్యాక్ చేసి అశ్లీల ఫొటోలు, కామెంట్లు పెడుతూ వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ తెలుగు యాంకర్ భీమినేని విష్ణుప్రియ ఫేస్బుక్ అక్కౌంట్‌ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేశారు. గత రాత్రి నుంచి ఆమె ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసిన కొందరు సైబర్ నేరగాళ్లు అందులో న్యూడ్ ఫొటోలు షేర్ చేశారు. దీంతో ఆమె అభిమానులు ఆ ఫోటోలు చూసి షాక్ అయ్యారు. అయితే ఆమె తన ఫేస్బుక్ హ్యాక్ అయినట్టు గుర్తించి.. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్‌కు తెలియజేసింది.
