వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు ప్రగతి పెట్టింది పేరు. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే ప్రగతి అప్పట్లో 7 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా చేస్తున్న ప్రగతి సడన్ గా సీరియల్స్ వైపుకు మళ్లారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం ఉందట.
చిన్న వయసులో తల్లిగా చేయాల్సిన వచ్చిన ప్రగతి పరిశ్రమలో ఎదుర్కొన్న అవమానాల గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రగతి మాట్లాడుతూ.. నేను 24ఏళ్ల వయసుకే తల్లి పాత్రలు చేయాల్సి వచ్చింది. నా వయసున్న హీరోయిన్ కి తల్లిగా చేయడం బాధ అనిపించేది. చంద్రమోహన్ ఫ్యామిలీతో మాకు పరిచయం ఉంది. ఆయన భార్యను నేను ఆంటీ అని పిలిచే దాన్ని, అలాంటిది ఆయన భార్యగా చేయాల్సి వచ్చింది. ఆరోజు బాగా ఏడ్చాను.
సెట్స్ కి రెండు జడలు వేసుకొని వెళితే.. ఆమె ఏంటి జడలు వేసుకుంది. కొప్పు ముడి వేసుకోమని చెప్పండి అనేవారు. ఆ మాటలు విని తట్టుకోలేకపోయాను. మేకప్ రూమ్ కి వెళ్లి కన్నీరు పెట్టుకున్నాను అని ప్రగతి చెప్పుకొచ్చారు. ఒక సినిమాలో రైన్ సాంగ్ చేయాలి. కాస్ట్యూమ్స్ విషయంలో అభ్యంతరం చెప్పాను. ఆ కారణంగా ఆ సినిమాను వదిలేశాను. ఆ సంఘటన తర్వాత సినిమాలు వదిలేసి సీరియల్ నటిగా మారానని ప్రగతి చెప్పుకొచ్చారు.