పుష్ప 1ది రైస్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 ది రూల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా పుష్పలో బన్నీ తగ్గేదెలే మ్యానరిజంకు వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రష్యాలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీని ప్రమోషన్స్ కోసం టీమ్ మొత్తం రష్యాకు వెళ్లింది. ఇప్పుడు ఈ సినిమాకి సెకండ్ పార్ట్ రాబోతుంది.
ఫస్ట్ పార్ట్ లో కనిపించిన నటీనటులే సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవ్వనున్నారు. ఒకట్రెండు కొత్త క్యారెక్టర్స్ కనిపించబోతున్నాయి. ‘పుష్ప1’లో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్ లతో పాటు మరో కొత్త విలన్ కూడా ఉన్నాడని సమాచారం. ఈ విలన్ ఎవరనేది ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ అతడెవరనేది ఇండస్ట్రీ వర్గాల ద్వారా బయటకొచ్చింది. అతడు మరెవరో కాదు నటుడు జగపతి బాబు.
కథ ప్రకారం సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు జగపతి బాబు. ఉన్న విలన్స్ తో పాటు జగపతి బాబుతో కూడా ఫైట్ చేయబోతున్నారు బన్నీ. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్, బన్నీ, దేవి శ్రీ ప్రసాద్ కాంబో అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తుండగా, పుష్ప 2ను 2024 మే లేదా ఏప్రిల్లో విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారట. పుష్ప2 అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.