ఈ చలికాలంలో నీటిలో చేతులు పెట్టడం కూడా కష్టంగానే ఉంటుంది. దీంతో అందరూ వేడి నీళ్లతో స్నానం చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నారు. అయితే గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే పర్వాలేదు కానీ.. బాగా వేడి నీటితో స్నానం చేస్తే మాత్రం ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. శీతాకాలంలో చాలా మంది టబ్‌లో లేదా వేడి షవర్ కింద ఎక్కువసేపు ఉండడం మంచిది కాదంటున్నారు. బాగా వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మంలోని తేమ శాతం తగ్గి చర్మం పొడిబారిపోతుందట. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సహజ నూనెలు, కొవ్వులు మరియు ప్రోటీన్‌లను వేడి నీరు నాశనం చేస్తుందట.
పొడి చర్మంతో ఇన్ఫెక్షన్ అవకాశాలు పెరుగుతాయి. మంచి బ్యాక్టీరియా నశించడం కారణంగా చర్మంపై పగుళ్లు, దురద సమస్యలు వంటివి ఎదురవుతాయని ఆయన అంటున్నారు. జుట్టు పెరుగుదల కూడా తగ్గిపోతుందట. తరచుగా వేడి స్నానాలు చేస్తే చర్మంపై ముడతలు, దురద లేదా దద్దుర్లు కూడా వస్తాయట. దీంతో యవ్వనంలోనే ముసలివారిలా కనిపిస్తారు. మొటిమలు ఉన్నవాళ్లు వేడి నీళ్లతో స్నానం చేస్తే.. మరింత పెరిగే అవకాశం ఉందట. నీళ్లు మరీ వేడిగా ఉంటే తలపై రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది.
దీనివల్ల జుట్టు పెరగుదల మందగించి.. హెయిర్ ఫాల్ మొదలవుతుంది. వేడి నీళ్ల కారణంగా హైపర్ టెన్షన్‌కు కూడా కారణం అవుతుంది. వేడి నీళ్లతో స్నానం చేస్తే వెంటనే నిద్రపోవాలనే భావన కలుగుతుంది. ఇది మిమ్మల్ని నీరసంగా మార్చేస్తుంది. ఇక తరచూ వేడి నీళ్లతో స్నానం చేస్తే సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. వారానికి కొన్ని సార్లు చల్లని నీటితో, మరికొన్ని సార్లు గోరువెచ్చని నీతితో స్నానం చేయడం ఉత్తమం అని అమెరికా స్కిన్ స్పెషలిస్ట్ చెపుతున్నారు.