వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా జనవరి 13వ తేదీన రిలీజ్ కానుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన తేదీ వెల్లడైంది. వైజాగ్ లో జనవరి 8వ తేదీన ఈ సినిమా ఈవెంట్ జరగనుందని సమాచారం. వాల్తేరు విశాఖకు సమీప ప్రాంతం కావడంతో ఈ సినిమా ఈవెంట్ ను అక్కడ చేయడం కరెక్ట్ అని చిరంజీవి భావించిన్నట్టు సమాచారం.
ఈ ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉండగా హైదరాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఈవెంట్ కు వెళ్లాలనుకునే మెగా అభిమానులు ఈ స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్లవచ్చు. 20 బోగీలలో కొన్ని బోగీలను హైదరాబాద్ అభిమానులకు కేటాయించారు. మిగిలిన బోగీలను వేర్వేరు ఊర్లకు సంబంధించిన అభిమానులకు కేటాయించారని తెలుస్తోంది.
ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేసేంత మంచి మనస్సు ఉన్న స్టార్ హీరోలు చాలా తక్కువమంది ఉంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో చిరంజీవి గ్రేట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఈవెంట్ కు లక్ష మంది అభిమానులు హాజరయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రత్యేక రైలు ఏర్పాటుతో విడుదలకు ముందే వాల్తేరు వీరయ్య సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.
