WiFiలో ఎలాంటి సమస్య లేనప్పటికీ దాని స్పీడ్ తగ్గడం లేదా ఇతర సమస్యలు తలెత్తుతున్నాయా..? అయితే మీరు వైఫై ద్వారా చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కొంతమంది సర్వీసును కూడా మార్చుకుంటారు. కొత్త సర్వీస్ కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. అయితే ఈ సమస్య ఎందుకు తలెత్తుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చూద్దాం..
నెట్‌వర్క్ స్ట్రెంత్:
మీ వైఫై నెట్‌వర్క్ స్ట్రెంత్ తగ్గిపోయినట్లయితే, మీ వైఫైని ఎవరైనా హ్యాక్ చేసి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మీ పాస్‌వర్డ్‌ను స్ట్రాంగ్ గా ఉండేలా మార్చండి.
డెడ్ వైఫై సిగ్నల్
మీ వైఫై సిగ్నల్ పూర్తిగా డెడ్ అయితే, మీ వైఫై హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ కేర్ కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతే, మీరు ముందుగా మీ వైఫై పవర్‌ను ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మీరు దాన్ని రీసెట్ చేసి పాస్‌వర్డ్‌ను మార్చుకోండి.
సిగ్నల్ హెచ్చుతగ్గులు:
సిగ్నల్ హెచ్చుతగ్గుల సమస్య మీ వైఫైలో నిరంతరం వస్తుంటే, మీ వైఫై హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. సిగ్నల్ హెచ్చుతగ్గులు ఉండటం సర్వసాధారణం. కానీ అది నిరంతరంగా ఉంటే మీరు వెంటనే మీ WiFi పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాలి.
వైఫై పవర్ ఆఫ్:
మీ వైఫై పదే పదే ఆఫ్ అవుతూ ఉంటే మరియు ఇలా జరగడానికి సరైన కారణం మీకు తెలియకపోతే, మీ వైఫై హ్యాక్ అయి ఉండవచ్చు. ఈ సమస్య విషయంలో మీరు కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.
