ఆచార్య చాణక్యుడు.. నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎప్పుడు, ఎలాంటి సందర్భంలో స్పందించాలి.. ఏయే సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను క్లుప్తంగా బోధించాడు. అయితే, చాణక్య నీతి ప్రకారం.. మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే పొరపాటున కొన్ని విషయాలను ఎవరితోనూ చెప్పకూడదు. ఎప్పుడూ దాచాల్సిన విషయాలు ఏంటో చూద్దాం..
* చాణక్య విధానం ప్రకారం.. పొరపాటున కూడా మీ ఇంటి విషయాలు బయటి వారికి చెప్పకూడదు. ఎందుకంటే ఈ కారణంగా మీ ఇంట్లో మనశ్శాంతి కరువవ్వడంతో పాటు వైరం తలెత్తవచ్చు.
* మీరు ఎంత సంపాదిస్తున్నారు లేదా మీ ఆదాయం ఎంత అని తరచుగా ప్రజలు అడుగుతారు. అటువంటి పరిస్థితిలో, మీరు పొరపాటున కూడా మీ సంపద, ఆస్తి గురించి బయటి వ్యక్తులకు చెప్పకూడదు.
* మీ ఆదాయాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే దురాశతో ప్రజలు హాని చేసే అవకాశం ఉంటుంది.
* భార్యాభర్తల మధ్య విషయాలు రహస్యంగా ఉంచాలి. ఇద్దరి మధ్య విషయాలను పొరపాటున కూడా ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ విషయాల వల్ల ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది.
* ఎవరైనా మిమ్మల్ని అవమానించినట్లయితే, దానిని మీకే పరిమితం చేసుకోండి అని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే.. దీనిని ఆసరాగా చేసుకుని ఇతరులు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది.
