సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే మహిళల పట్ల, అమ్మాయిలు పట్ల జరుగుతున్న దాడుల గురించి కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా తరచూ ఖండిస్తూ పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది మహిళలు అమ్మాయిలు తమ కుటుంబంలోనూ అలాగే తమ పరిసర ప్రాంతాల్లో ఇతరులు పట్ల వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఈమెతో పంచుకొని పరిష్కారాన్ని అడుగుతూ ఉంటారు.
తాజాగా ఈమె అమ్మాయిలపై జరిగే వేధింపులు బ్లాక్మెయిల్ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా ఈమె మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో అమ్మాయిలకు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్ లేదా ఇంస్టాగ్రామ్ ద్వారా వాళ్లకి రిప్లై ఇవ్వకపోతే తమ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించే వారి సంఖ్య ఎక్కువైంది.
ఇలా బెదిరించేటప్పుడు అమ్మాయిలు వారిని ప్రాధేయపడకుండా, భయపడకుండా ఎదిరించండి అంటూ చిన్మయి ధైర్యం చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు ఎవరు, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా వారికి ఎదురు తిరగండి. ఈ విషయం గురించి మీ ఇంట్లో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. మీరెంటో మీకు తెలుసు. ఒకరి కోసం మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ ఈమె నేటి యువతరానికి ఎంతో ధైర్యం నింపుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/reel/CmohQFyoqXf/?igshid=YmMyMTA2M2Y=