గృహహింస గురించి ఎన్ని చట్టాలు చేసినా, ఎంత అవగాహన కల్పించిన నేరాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. తాజాగా యూపీ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. పెళ్లై ఆరేళ్లైనా పిల్లలు కావడం లేదని ఓ వ్యక్తి భార్య ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. లక్నోకి చెందిన రవీంద్రకు ఆరేళ్ల క్రితం వివాహమైంది.
పిల్లలు లేకపోవడంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఆమె గత 8 నెలలుగా తల్లి ఇంట్లో ఉంటోంది. ఆదివారం రాత్రి అత్తింటికి వెళ్లిన రవీంద్ర.. ఇంటికి రావాలని భార్యను ఒప్పించాడు.
Also Read : అన్ స్టాపబుల్ వలన పవన్ కి లాభమా? నష్టమా
అనంతరం ఆమెతో అసహజ సెక్స్ కు ప్రయత్నించగా.. ఒప్పుకోకపోవడంతో రహస్య భాగాలపై బ్లేడుతో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
