ఆరోగ్యానికి నడక దివ్య ఔషధంగా సాయపడుతుంది. అందుకే పొద్దున్నే లేచి రోజుకు కనీసం ఓ అరగంట పాటైనా వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రోజు వాకింగ్ చేయడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంది.
నడక వలన ప్రయోజనాలు..
ఈ రోజుల్లో మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు చిన్న వయసులోనే దరిచేరుతున్నాయి. వాటిని నియంత్రణలో ఉంచుకోవడానికి నానా రకాల మందులు వాడాల్సి వస్తోంది. భవిష్యత్ లో వీటితో ఎన్నో నష్టాలు ఉండటంతో మందుల వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి చక్కని నడక, వ్యాయామం, తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ప్రయోజనం కలుగుతుంది. ఇలా మన దినచర్యలో మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
Also Read : పచ్చిపాలతో అద్భుత ప్రయోజనాలు.. ఇవి తెలిస్తే అస్సలు వదిలి పెట్టారు..!
రోజు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల ఎన్నో కేలరీల శక్తి ఖర్చవుతుంది. వాకింగ్ తో దాదాపు 25 రకాల రోగాలు రాకుండా ఉంటాయని చాలామందికి తెలీదు. ఇంకా పరుగెత్తితే 120 కేలరీల శక్తి ఖర్చవుతుంటే వాకింగ్ చేయడం ద్వారా 240 కేలరీల శక్తి ఖర్చుకావడం గమనార్హం. వాకింగ్ చేయడంతో షుగర్, బీపీ నియంత్రణలోకి వస్తాయి. గుండె జబ్బుల ముప్పు ఉండదు. అలాగే వాకింగ్ ద్వారా అధిక బరువు తగ్గుతయారు. ఇంకెందుకు ఆలస్యం రోజూ ఓ అరగంట నడక ప్రారంభించండి.
Morning Walk may help you meet your weight loss goals. Walking at a moderate pace for 30 minutes can burn up to 240 calories.