మెగాస్టార్ చిరంజీవి గురువారం చిత్రపురి కాలనీలో నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించాడు. లబ్దిదారులకు ఇంటిపత్రాలు, తాళాలను అందజేశాడు. అనంతరం మెగాస్టార్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. సినీ పరిశ్రమలో తను పెద్దను కానని, కొందరు చిన్న వాళ్ళుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద వాడ్ని చేస్తున్నారని వెల్లడించాడు. సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.అనిల్, దొరై ఎంతో కష్టపడి గృహా సముదాయాన్ని పూర్తి చేశారు.
దాసరి నారాయణ, రాఘవేంద్రరావు వంటి పెద్దలు దీనికి చాలా కృషి చేశారు. ఎం. ప్రభాకర్ రెడ్డి దూరదృష్టి వల్లే కార్మికుల కల సాకారమైంది. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి గృహసముదాయం లేదు. ఇక చిత్రపురి కాలనీలో అవినీతి, అవకతవకలు జరిగాయని అన్నారు.. కానీ ఆ విషయం గురించి నాకు తెలియదు కాబట్టి మాట్లాడటం అసంబద్ధమే అవుతుంది. సినీ కార్మికులకు ఎప్పుడు, ఏ సహాయం కావాలన్నా నేను సపోర్ట్‌గా ఉంటాను.
Also Read: 2023 సంక్రాంతి విజేత ఎవరో తేలిపోయింది..
కార్మికులకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజంకాస్తా. కోరుకున్న దానికంటే భగవంతుడు నాకు ఎక్కువే ఇచ్చాడు. నన్ను అందరూ చిత్ర పరిశ్రమకు పెద్దోడు అంటున్నారు. పెద్దరికం అనుభవించాలని నాకు లేదు నాకంటే చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్లు చిన్నవాళ్లుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదములు” అంటూ చిరంజీవి పేర్కొన్నారు.