2019 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని సొంతం చేసుకుంది YSRCP పార్టీ. రాష్ట్ర చరిత్రలో ఎవరికి రానన్ని ఎమ్మెల్యే, ఎంపి స్థానాల్లో జెండా ఎగురవేసింది.
అట్టహాసంగా ముఖ్య మంత్రిగా వైఎస్ జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగడం అందులో రాష్ట్ర ప్రజలు తడిచి ముద్దైయ్యే రేంజ్ లో వరాల జల్లులు కురిపించడం విదితమే.
కానీ ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్టు వై ఎస్ జగన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన దగ్గరి నుంచి అసలు సినిమా మొదలైంది. ప్రజా వేదిక కూల్చడంతో మొదలైన ఆయన పరిపాలన అడుగడునా విమర్శలకు దారితీసింది.
ప్రత్యేక హోదా, సీపీఎస్, Dsc, ఉద్యోగాల కాలెండర్, పోలవరం మొదలైన హామీలను తాను మాత్రమే చేయగలను అని సాధించగలను అని జగన్ రెడ్డి తన పాద యాత్ర సమయంలో పదే పదే భీంకాలు పలికారో వాటిని పూర్తిగా గాలికి వదిలేసి నిరుద్యోగుల దగ్గర నుండి రైతులు, ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరి దగ్గర తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది.
ఇక అమరావతి ఉద్యమంలో ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరించిన తీరు..మూడు రాజధానులు విషయంలో జగన్ రెడ్డి పిల్లి మొగ్గలు..జిల్లాల విభజన పేరుతో రేపిన కుల చిచ్చుల గురించి జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
పాలనా సౌలభ్యం పేరుతో పార్టీ సానుభూతి పరులనే వాలెంటిర్ వ్యవస్థగా ఏర్పాటు చేసి పథకాలు తీసేస్తాము అనే వంకతో ఓటర్లను తమ గుప్పెట్లో పెట్టుకోవాలి అని చూస్తుంది అని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్.
Also Read: సీఎం జగన్పై కేంద్ర మంత్రి ప్రశంసలు
కేవలం సంక్షేమం పథకాల మీదే ఆధారపడిన వైఎస్ జగన్ ప్రభుత్వం సంపాదన మీద పట్టు కోల్పోయి నెల జీతాలకు కూడా అప్పు చేయాల్సిన పరిస్తితిలో ఉంది.
పెట్టుబడులు లేక సంపద సృష్టి చేతకాక కొత్త పన్నులు వేయడం, ప్రభుత్వ భూములను తనఖా పెట్టడం, దేవాలయాల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి రకరకాల మార్గాలలో ఆదాయాన్ని సృష్టించుకునే క్రమంలో నిత్యం ఏదో ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాగ్రహానికి గురవుతుంది.
సంపూర్ణ మద్యపానం అంటూ ఊదరకొట్టిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిషేధం సంగతి దేవుడెరుగు ఊరూ పేరూ లేని బ్రాండ్లనీ తెచ్చి మందుబాబుల ఒళ్లు.. జేబులు గుల్ల చేస్తూ ప్రతి ఏడాది మద్యం దుకాణాల పర్మిట్ లు పొడిగిస్తూ ఇదే మద్యపాన నిషేధం అంటూ గొప్పలు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది..
దీనికి తోడు ప్రతి పక్షాలను విమర్శించే క్రమంలో వైసిపి నాయకుల బూతు భాష అటు వైసిపికి సపోర్ట్ చేసిన విద్యావంతులు కూడా ఈసడించుకుంటుండగా ముఖ్య మంత్రి వారిని వెనకేసుకు రావడం..వారికే పదవులు కట్టబెట్టడం ఇటు రాజకీయ విమర్శకులని కూడా విస్మయానికి గురిచేస్తోంది.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వాన్నీ ప్రశ్నించిన వారిపై దాడులు చేయడాన్ని సమర్ధించడం..తన స్థాయిని మర్చిపోయి పదే పదే ఇతర నాయకుల వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేయడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. ఇక పోలీసు వ్యవస్థను వైసిపి ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఉచిత పథకాల లబ్ధి దారులను తగ్గించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వింత మార్గాల వల్ల ఖచ్చితంగా మధ్య తరగతి ప్రజలు వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు.
వెరసి తమని ఎవరు ప్రశ్నించకూడదు..మేము చేసిందే చట్టం..మా ప్రభుత్వం శాశ్వతం అంటూ జగన్ రెడ్డి ప్రభుత్వ అనుసరిస్తున్న నియంత పోకడల వల్ల అన్ని వర్గాల ప్రజలు కలిసి వచ్చే ఎన్నికల్లో ఫాన్ స్విచ్ ఆపడం ఖాయం అని అర్థం అవుతుంది.