ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ.. షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందులో క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు ఒకటి కాగా మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. అయితే ఈ ప్రాజెక్ట్ లు పూర్తి కాకముందే పవన్ కళ్యాణ్ సాహో డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమాని అనౌన్స్ చేశాడు. అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.
ఇటీవల ఆఫీషియల్ గా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోందని సమాచారం. కాగా, చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైనమెంట్స్ ఈ సినిమాలో కొన్ని విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆర్ట్, ఫ్యాషన్, ఎన్విరాన్మెంట్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్ విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. ఆ పోస్టర్లో ఓ పెన్‌పై జపనీస్ భాషలో ఏవో అక్షరాలు రాసి ఉన్నాయి. ఆ పోస్టర్ కింద #OG #firestormiscoming అని జత చేసింది. ఆసక్తి కలవారు team@theycallhimog.comకి తమ సీవీలను మేయిల్ చేయవచ్చని తెలిపింది. కాగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా రవి చంద్రన్ వ్యవహరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత డీవీవీ బ్యానర్లో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
We are looking forward to hiring professional artists in the mentioned fields.
If you think you are the one we are looking for, don’t look back!! 🤘🏻
Email your work samples to team@theycallhimog.com #OG #FirestormIsComing pic.twitter.com/0YNLFl1qCU
— DVV Entertainment (@DVVMovies) December 31, 2022