Allu Arjun watched Waltair Veerayya : మెగా- అల్లు కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ బయటికి రావాలని చాలా కాలం నుంచి చూస్తున్నాడని ఆ వార్తల సమాచారం. అయితే ఈ విభేదాల గురించి ఇప్పటికే అల్లు అరవింద్, చిరంజీవి క్లారిటీ కూడా ఇచ్చేశారు.
అందరు సినిమాల పరంగా పోటీ పడుతుంటారేమో కానీ, మెగా కజిన్స్ ఎప్పుడు ఒక్కటిగానే ఉంటారని చిరంజీవి చెప్పుకు రాగా.. బయట తామంటే గిట్టనివారు ఇలా పుకార్లు సృష్టిస్తున్నారని, తామెప్పుడు కలిసే ఉంటామని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. అంతకు ముందు మెగా కజిన్స్ పార్టీలో అల్లు అర్జున్ మిస్ అయ్యి కనిపించాడు. ఈ పుకార్లు రోజురోజుకీ పెరుగుతుండడంతో మెగా కజిన్స్ పార్టీలలో అల్లు బ్రదర్స్ మెరిశారు.
Also Read: 18 Pages Movie Review in Telugu
మరోసారి ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ తాజాగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వాల్తేరు వీరయ్య సినిమాను చూశారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ అభిమానులతో కలిసి ఆయన సినిమాను చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు డుతున్నాయి. కాగా తాను మెగాస్టార్ కి వీరాభిమాని అని అల్లు అర్జున్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీ ఫ్యాన్ మూమెంట్ ని బన్నీ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
Icon StAAr @alluarjun watching his hardcore Mega Star @KChiruTweets fan movie #WaltairVeerayya 😍🔥#AlluArjun #Chiranjeevi #MegaStarChiranjeevi #Chiranjeevi pic.twitter.com/Mg0FPCtdTr
— Nithin (@NithinPSPKCult) January 13, 2023