Pawan Kalyan Unstoppable 2 Episode Promo : తెలుగు సినిమా ప్రేక్షకులు, రాజకీయ వర్గాలతో పాటు నందమూరి ఫ్యాన్స్, మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎపిసోడ్ నుంచి చిన్న వీడియో గ్లింప్స్ విడుదలైంది. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఒక్క స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన క్రెడిట్ ఆహా ఓటీటీదే. అన్‌స్టాపబుల్ 2కు పవన్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ రోజు ఆ ఎపిసోడ్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. వీడియో గ్లింప్స్‌లో పెద్దగా డైలాగులు లేవు. ఉన్నది ఒక్కటే డైలాగ్.. పవన్ కళ్యాణ్ స్టేజి మీదకు వచ్చిన తర్వాత నేను కొన్ని మెజర్‌మెంట్స్ (కొలతలు) తీసుకోవాలి అని బాలకృష్ణ అన్నారు. అంతే ఒక్కసారిగా పవన్ నవ్వేశారు. ఈ విజువల్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. షోలో ఇద్దరి మధ్య చాలా ఇటువంటి సరదా సంభాషణలు చాలా ఉన్నాయట.
Also Read : Lizard Astrology in Telugu
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఏయే టాపిక్స్ గురించి అన్‌స్టాపబుల్ 2లో మాట్లాడారు? అని సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు.. రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ అతిథులుగా వచ్చిన ఎపిసోడ్‌లోనే పవన్ కళ్యాణ్ ‘అన్‌స్టాపబుల్ 2’కు వస్తారని ప్రేక్షకులకు అర్థమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫోన్ చేయగా… ‘అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావ్?’ అని బాలకృష్ణ అడగటం, మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సార్ అని త్రివిక్రమ్ బదులు ఇవ్వడం తెలిసిన విషయమే.