Vijay Devarakonda’s Next With Ram Charan’s Story : లైగర్ డిజాస్టర్ తర్వాత గ్యాప్ ఇచ్చాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా దెబ్బతో పూరి జగన్నాధ్ తో కలిసి చేయాల్సిన జనగణమన అనే ప్రాజెక్ట్ ను కూడా రద్దు చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో ఖుషి అనే సినిమా మాత్రమే ఉంది. సమంతకు ఒంట్లో బాగోలేకపోవడంతో, ఆ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.
అయితే లైగర్ తర్వాత విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకోకుండా కొద్దిగా అభిమానులను మెప్పించే కథలను ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగానే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను ఈ మధ్యనే ప్రకటించాడు విజయ్.
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది(Devarakonda’s Next With Ram Charan’s Story). ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. ‘నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పేందుకు.. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు.. గుర్తుతెలియని గూఢచారి’ అంటూ కాన్సెప్ట్ పోస్టర్‌ను షేర్ చేసింది చిత్ర బృందం.
అయితే అంతకుముందు ఇదే కథతో గౌతమ్, రామ్ చరణ్ వద్దకు వెళ్లడం, ఆయన కూడా ఓకే చేయడం, అధికారికంగా ప్రకటించడం అన్ని చకచకా జరిగిపోయాయి. కానీ, అనుకోనివిధంగా రామ్ చరణ్ ఈ కథ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అదే కథను విజయ్ కు వినిపించి గౌతమ్ ఓకే అనిపించేశాడు.
ఇక అసలు చరణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడం వెనుక ఉన్న కథ ఏంటీ..? అని అంటే.. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ చేసిన పాత్రకు లాగానే ఇందులో కూడా పోలీసాఫీసర్ అవ్వడం కోసం హీరో కష్టపడుతూ ఉంటాడట. అంతకుముందు ఈ పాత్ర నచ్చినా.. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ లో చరణ్ చేసిన రామరాజు పాత్ర ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
అలాంటి పాత్రే మరోసారి చేస్తే.. ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని ఆలోచించి చరణ్ వెనకడుగు వేశాడట. ఇక చరణ్ ప్లేస్ లో విజయ్ రావడంతో మరోసారి ఈ సినిమాపై అభిమానులకు ఆశలు రేకెత్తాయి. మరి చరణ్ కు సెట్ కానీ ఈ సినిమా విజయ్ కు ఎలా సెట్ అవుతుందో చూడాలి.