Waltair Veerayya Collections : ప్రతి పండక్కి చాలా సినిమాలు వస్తాయ్.. కానీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ కే పండగను తెస్తాయ్.. సరిగ్గా అలాంటి సినిమా నే వాల్తేరు వీరయ్య..మూడు రోజుల్లోనే 108 కోట్లు కొల్లగొట్టి ఈ సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర విలయ తాండవం చేస్తుంది ఈ సినిమా. ఓవర్సీస్ లో కూడా దీని విజృంభణ మామూలుగా లేదు. మూడు రోజుల్లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించినంత కొట్టింది. సరైన హీరో కి సరైన సినిమా పడితే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపిన సినిమా ఇది..
నిజానికి ఇది కొందరు సినిమా చూడని, మరియు కొన్ని వెబ్సైట్స్ కావాలని చేసిన దుష్ప్రచారం లా రెగులర్ కమర్షియల్ మూవీ కాదు. ఏదో రెండు ఎలివేషన్ సీన్లు.. నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు.. కొన్ని కామెడీ, ఎమోషన్ సీన్ల తో చుట్టేయలేదు.. వాటితో పాటు ట్విస్టులతో కూడిన మంచి స్టోరీ ఉన్న సినిమా.. దానికి మెగాస్టార్ లాంటి సరైన హీరో పడడం తో కలెక్షన్స్ ఈ రేంజ్ లో కొల్లగొడుతుంది..
Also Read : రామ్ చరణ్ కు సెట్ కానీ పాత్ర విజయ్ కి ఎలా సెట్ అవుతుంది..!?
ఇదే స్టోరీని ల్ ఏదైనా మంచి “ఇంగ్లీష్ టైటిల్” పెట్టి వీరయ్య ని వీర్ చేసి హీరో స్టైలిష్ గా చూపించి నెరేషన్ ని కాస్త క్లాస్ గా ఇచ్చి ఇవే ట్విస్టులతో ఓ చిన్న హీరో చిన్న సినిమా తీస్తే.. “వావ్ సూపర్.. కళాఖండం..” అని చప్పట్లు కొట్టే వారు. ఇక్కడ హీరో మెగాస్టార్ కావడమే కొందరి ఏడుపుకు రీజన్..
Also Read : Why Does Love Disappear From a Marriage?
ఏది ఏమైనా మూవీ చాలా బాగుంది.. బాబీ అద్భుతం గా డైరెక్ట్ చేసాడు. ఒక అభిమాని తన అభిమాన హీరో సినిమా ఎలా ఉంటే బాగుంటుందో ఎలా ఉండాలి అని కోరుకుంటాడో అలా తీసాడు సినిమాని. రీ ఎంట్రీ తరువాత మెగాస్టార్ మూవీస్ లో ఇదే బెస్ట్ అని చెప్పవచ్చు. అందుకే ఈ రోజు కలెక్షన్స్ మాట్లాడుతున్నాయి.