18 Pages OTT: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ బెల్ట్‌లో మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తర్వాత యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు సూర్యప్రతాప్ తెరకెక్కించిన చిత్రం 18 పేజెస్. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తొలి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది.
ఇక ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దం అవుతోంది. అది కూడా ఒకటి.. ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. అలాగే, నిర్మాత సంస్థకు చెందిన ఆహాలో ఈ చిత్రాన్ని ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
Also Read: వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా.. టిడిపికి షాక్..!!
తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ జనవరి 27వ తేదీ నుంచి ఈ రెండు ఓటీటీ సంస్థల్లో స్ట్రీమింగ్ అవబోతున్నట్లు తెలిసింది. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి గోపీ సుందర్ సంగీతం అందించాడు.
Page-lu 18 aina, minimum 18 saarlu choodataaniki siddham.
18 pages is coming on Netflix as a post theatrical release!💕#NetflixPandaga #18Pages #NetflixLoEmSpecial pic.twitter.com/vkkgK5dV2v
— Netflix India South (@Netflix_INSouth) January 14, 2023
For 100% Telugu entertainment, look no further but #ahavideo.#18PagesOnAha will stream on aha post theatrical release🕺🕺🕺#18Pages pic.twitter.com/xwnFqilGI6
— ahavideoin (@ahavideoIN) January 14, 2023