Team India cricketers meet Jr NTR : శ్రీలంకపై సిరీస్ విజయాలను సాధించిన టీమిండియా మరో ఫైట్ కు సిద్దమవుతోంది. న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లను ఆడనుంది. ఈ క్రమంలో తొలి వన్డేకు భాగ్యనగరం హైదరాబాద్ వేదికగా నిలవనుంది. జనవరి 18న హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.

ఈ క్రమంలో ఇరు జట్లు కూడా హైదరాబాద్ కు చేరుకున్నాయి. న్యూజిలాండ్ మూడు రోజుల క్రితమే హైదరాబాద్ కు చేరుకోగా.. శ్రీలంకతో మూడో వన్డే అనంతరం జనవరి 16న భారత జట్టు నగరానికి చేరుకుంది. హైదరాబాద్ కు చేరుకున్న భారత జట్టులోని కొందరు సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకున్నారు.
సూర్యకుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చహల్, శార్దుల్ ఠాకూర్ సోమవారం రాత్రి ఎన్టీఆర్ ను కలుసుకున్నారు. ఈ క్రమంలో వీటికి సంబంధించిన ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘టీమిండియాతో భీమ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
