Waltair Veerayya 5 days Collections : బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. విడుదలైన ఐదు రోజుల్లోనే 144 కోట్ల గ్రాస్ వసూళ్లతో దాదాపు 84 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Also Read : ఆదిపురుష్ రిలీజ్ డేట్.. డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే.
విడుదలైన రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కి కలెక్షన్స్ మరో వారం రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ మధ్య కాలం లో ఎపుడూ లేని విధంగా థియేటర్స్ కి జనం ఎగబడుతున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల సినిమాకి హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. చూస్తుంటే వాల్తేరు వీరయ్య ఫైనల్ గా 135+ కోట్ల షేర్ సాధించే అవకాశం కనిపిస్తోంది..
ఏరియా వారీగా ఈ సినిమా సాధించిన వసూళ్లు..
నైజాం 22.46 కోట్లు
సీడెడ్ 13.11 కోట్లు
ఉత్తరాంధ్ర 8.69 కోట్లు
తూర్పు గోదావరి 6.64 కోట్లు
పశ్చిమ గోదావరి 3.81 కోట్లు
గుంటూరు 5.45 కోట్లు
కృష్ణ 4.98 కోట్లు
నెల్లూరు 2.54 కోట్లు
తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ – 67.68 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా 5.65 కోట్లు
ఓవర్సీస్ 10.20 కోట్లు
టోటల్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.53కోట్లు..(రూ. 144.15 కోట్ల గ్రాస్)