• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Tips To Prevent Your Milk From Boiling Over : పాలు పొంగిపోకుండా ఇలా చేయండి..

R Tejaswi by R Tejaswi
January 20, 2023
in Latest News
0 0
0
Tips To Prevent Your Milk From Boiling Over : పాలు పొంగిపోకుండా ఇలా చేయండి..
Spread the love

Tips To Prevent Your Milk From Boiling Over: పొయ్యి మీద పాలు పెడతాం.. మరో పనిలో నిమగ్నమవుతాం.. లేదంటే ఏదో ఆలోచనలో మునిగిపోతాం. దాంతో పాలు పొంగిపోయి స్టౌ, కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ అంతా పాడైపోతుంది.

మళ్లీ వాటన్నింటినీ శుభ్రం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంట్లో ఇది తరచూ జరుగుతూనే ఉంది. మరి, పాలు వేడి చేసేప్పుడు అవి పొంగిపోకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

* చాలామందికి పాత్రలో పాలు పోశాక.. అందులో నీళ్లు కలపడం అలవాటు. కానీ ముందు కొన్ని నీళ్లు పోసి.. అవి మరుగుతున్నప్పుడు పాలు పోస్తే అవి పొంగిపోవట!

* పాలు పొంగిపోవడానికి పాత్ర పరిమాణం కూడా ఓ కారణమే. ఈ క్రమంలో చిన్న పాత్ర తీసుకొని దాని నిండా పాలు పోస్తే అవి పొంగిపోతాయి. కాబట్టి పాలు కాయడానికి వెడల్పు, లోతు ఎక్కువగా ఉన్న పాత్రను తీసుకోవాలి. తద్వారా అవి పొంగిపోకుండా ఉంటాయి.

* పాలు కాయడానికి ఉపయోగించే పాత్ర అంచులకు కాస్త వెన్న రుద్ది.. కాచినట్లయితే అవి పొంగకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

* ఒక్కోసారి అక్కడే ఉండి పాలు కాస్తున్నప్పటికీ అందులోని నురగ పైకి వస్తూ పాలు పొంగిపోతుంటాయి. ఇలాంటప్పుడు పైకి వస్తున్న నురగపై కొన్ని నీళ్లు చల్లితే సరి.

* పాలు, ఇతర పదార్థాలు పొంగిపోకుండా ఉండేందుకు ప్రస్తుతం మార్కెట్లో స్పిల్‌ స్టాపర్స్‌ దొరుకుతున్నాయి. వీటిని మూతలాగా గిన్నెకు ఫిక్స్‌ చేస్తే.. పాలు పొంగిపోవు. వీటిని సిలికాన్‌తో తయారుచేస్తారు కాబట్టి.. వేడి పాల వల్ల అది కరిగిపోదు.

* పాలు మరుగుతున్నప్పుడు అర టీస్పూన్‌ వంట సోడాను అందులో వేయడం వల్ల అవి పొంగిపోకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే పాలు విరిగిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంచేందుకు ఇది దోహదం చేస్తుంది.

* పాలలోని మీగడ మందపాటి లేయర్‌లా తయారై పొంగడం చూస్తుంటాం. ఈ సమయంలో ఒక టీస్పూన్‌/బీటర్‌ సహాయంతో పాలను కలిపినట్లయితే పాలు పొంగిపోకుండా చూసుకోవచ్చు.


Spread the love
Tags: Health tipsHow Do You Prevent Milk From Boiling Over?How to Prevent Milk From Boiling OverKitchen HacksKitchen tipsPrevent milk boiling overQuick Tips to Prevent Milk Boiling OverSimple Tips to Stop Milk From Boiling OverTips To Prevent Your Milk From Boiling Overవంటింటి చిట్కాలు
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.