Do this on Your Birthday : పుట్టిన రోజునాడు ఈ శ్లోకం చదివి ఇలా చేయండి..
మన వేదాల్లో అనేక రకాల దోషాలకు నివారణ పూజలు, నియమాలు,శ్లోకాలు,మంత్రాలు నిక్షిప్తమై ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే.
అలాంటి వాటిలో మృత్యు దోషానికి సంబంధిన శ్లోకాన్ని పండితులు తరచూ ఉద్ఘాటిస్తూ ఉంటారు.
అశ్వత్థామ, బలిర్వర్యాసో, హనుమాంశ్చ విభీషణ !
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవనః !!
సప్తైతాన్ సంస్మరేన్నిత్యమ్ మార్కండేయ యథాష్టమమ్!
జీవేద్వర్శశతమ్ ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః !!
పుట్టిన రోజునాడు ఆవు పాలు, బెల్లము, నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి పై శ్లోకం చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుందనీ పండితులు చెబుతున్నారు.
