BalaKrishna Speech in VeeraSimhaReddy Success Meet : వీరసింహారెడ్డి విజయోత్సవ వేదిక మీద నందమూరి బాలకృష్ణ చేసి వ్యాఖ్యలు మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసాయి.
అను”కుల” మీడియా సంస్థలు,విదేశాల్లో ఉన్న సొంత వర్గ సానుభూతి పరులు కలిసికట్టుగా ఎంత ప్రయత్నించినా తన సినిమా వాస్తవంలో ఆశించినంతగా ఫలితాలను నమోదు చేయలేక పోవడం. ఎవరి మీదనైతే పై చేయి సాధించాలి అని పట్టుబట్టి డిసెంబర్లో విడుదల అవ్వాల్సిన తన సినిమాని సంక్రాంతికి వాయిదా వేసుకున్నాడో వారి సినిమా సంక్రాంతి విజేతగా నిలిచిందన్న అసహనమో బాలకృష్ణనీ మరోసారి వివాదాల్లోకి నెట్టింది.
Also Read : అన్ స్టాపబుల్ వలన పవన్ కి లాభమా? నష్టమా?
అకారణంగా అసందర్భంగా బాలకృష్ణ వాడిన బూతు పదజాలం,పురాణాలు,మహాభారతం గాడిద గుడ్డు అంటూ చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే… తన తండ్రిని స్తుతించే క్రమంలో స్వర్గీయ ఎస్వీ రంగారావు గారిని..అక్కినేని..తొక్కినేని అంటూ అక్కినేని కుటుంబం పైన బాలకృష్ణ వాడిన దురుసు మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవ మర్యాదలు ఉంటాయ్. ఎవరూ ఎవరి కింద బానిసలు కాదు..మనది రాజరికం అసలే కాదు అన్న ఇంగిత జ్ఞానం బాలకృష్ణకి ఈ జన్మలో రాదా? తనకి తానే దైవాంశ సంభూతునిలా..తన కుటుంబం..తన వంశానికి మాత్రమే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయనే భ్రమ నుంచి బాల కృష్ణ బయట పడడా? పరనింద చేయనిదే తాము గొప్ప అని చెప్పుకోలేని మానసిక ధౌర్భల్యానికి మందులేదా అని సామాన్య ప్రజలు సైతం చీత్కరిస్తుంటే… సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
మరోపక్క నందమూరి అభిమానులు.. అను”కుల” వర్గాలు బాలయ్యది పసిపిల్లాడి మనస్తత్వం.. కొట్టినా బాలయ్యే. తిట్టినా బాలయ్యే..పెట్టినా బాలయ్యే అంటూ వెగటు భాష్యం చెప్పుకుంటూ సమర్థించుకుంటున్నారు.
మెగా ఫ్యామిలి సినిమాలోని పాటలకే ఆడవాళ్ళ మాన ప్రాణాలు పోతున్నాయి అంటూ రోడ్డెక్కే మహిళా సంఘాల నాయకురాళ్ళు బాలకృష్ణ పదే పదే బహిరంగంగా మహిళపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నా కిమ్మనకుండా మిన్నకుండడం కొస మెరుపు.